టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలలో అదిరిపోయే జంట మహేష్ నమ్రత జంట. గతంలో హీరోయిన్ గా ఉన్నా నమ్రత పెళ్లి చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి సంబంధించిన వ్యాపారాలు సినిమాల విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మహేష్ సక్సెస్ లో కీలకంగా మారింది.

Image result for mahesh babu namratha

అదే క్రమంలో మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో జయాపజయాల విషయంలో కెరియర్ లో ఎక్కువగా తన భార్య నమ్రతా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలా ఇంటర్వ్యూలలో తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత.. మహేష్ బాబు సినిమాల గురించి సంచలన కామెంట్ చేసింది. ముఖ్యంగా తన భర్త సినిమాలను మొదటిరోజు చూడాలని ఉంటుంది గాని ఒత్తిడి వల్ల తాను ఫస్ట్ డే సినిమా చూడను అంటూ పేర్కొంది.

Image result for mahesh babu namratha

మహేష్ సినిమాలను మొదటిరోజు చూడాలని కుటుంబ సభ్యులు చాలామంది ఆతృతగా ఉంటారు..ఇంకా కొంతమంది అయితే ఇంటిలోనే ప్రివ్యూ వేసుకుని చూడాలని ఆశిస్తారు..కానీ ఒత్తిడి వల్ల నేను మహేష్ బాబు సినిమాలను మొదటిరోజు చూడలేను అంటూ నమ్రత పేర్కొంది. దీంతో నమ్రతా వ్యాఖ్యలు విన్న మహేష్ అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: