‘మహర్షి’ మూవీకి ఓవర్సీస్ లో కూడ పాజిటివ్ టాక్ వచ్చినా ఆమూవీ టాక్ కు సరిపోయే విధంగా ఓవర్సీస్ కలక్షన్స్ రాకపోవడం ఆమూవీ ఓవర్సీస్ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్. దీనితో ఓవర్సీస్ ప్రిన్స్ గా పిలవబడే మహేష్ సినిమాల మ్యానియా ఓవర్సీస్ లో తగ్గిందా అన్న అనుమానాలు కొందరికి ఏర్పడుతున్నాయి. ఇలాంటి అనుమానాలు ఏర్పడటానికి గల కారణం ‘మహర్షి’ మూవీకి అనుకున్న రీతిలో ఓవర్సీస్ కలక్షన్స్ రాకపోవడం అని అంటున్నారు. 

చరిత్ర తిరగరాస్తుంది అని ఆశించిన మహర్షి ప్రీమియర్ల షోల నుండి అమెరికాలో కేవలం 500K మాత్రమే రావడంతో అక్కడ మహేష్ మ్యానియా తగ్గిందా లేకుంటే ‘మహర్షి’ మూవీ పై చెప్పుకోతగ్గ ఆసక్తి ఏర్పడ లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి మహేష్ ‘మహర్షి’ ప్రీమియర్లకు కనీసం ఒక మిలియన్ డాలర్లు కలక్షన్స్ వస్తాయని ఆశించారు. 

కానీ ఆ స్థాయిలో ఓవర్సీస్ ప్రీమియర్ కలక్షన్స్ రాలేదు.  వాస్తవానికి ఈపాటి వసూళ్లు ఎప్పుడో ఐదారేళ్ళ క్రితమే మహేష్ ఫ్లాప్ మూవీస్ కూడా వచ్చాయి. మహేష్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా టిక్కెట్ ధరల్లో చాల వ్యత్యాసాలు కూడ వచ్చాక ‘మహర్షి’ కి వస్తున్న ఓవర్సీస్ కలక్షన్స్ మహేష్ ఓవర్సీస్ మార్కెట్ పై సందేహాలు కలిగిస్తున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ‘మహర్షి’ కి కనీసం రెండు మిలియన్ డాలర్ల కలక్షన్స్ ఈ వీకెండ్ కు వస్తాయా రావా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం వివరిస్తూ ‘మహర్షి’ గురువారం విడుదల కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అయితే ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేసిన ‘మహానటి’ బుధవారం రోజున ‘గీతాగోవిందం’ గురువారం రోజున విడుదలైన విషయాలను గుర్తుకు చేస్తూ ‘మహర్షి’ ప్రీమియర్ షోలకు సూపర్ రెస్పాన్స్ రాకపోవడం వెనుక మరేదో కారణం ఉంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: