సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను స్వంతం చేసుకున్నది. అయితే కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజ్ ముందు వచ్చిన హైప్ చూస్తే నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొడుతుందని అంచనా వేశారు. నిర్మాత దిల్ రాజు సైతం అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అందుకునే కెపాసిటీ ఉన్న సినిమా అని ప్రకటనలు చేశారు.


అయితే దిల్ రాజు ప్రెడిక్షన్స్ కొంత వరకు నిజమే అయినప్పటికీ అన్ని ఏరియాల్లో వర్కౌట్ కాలేదు. అయితే నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో 'మహర్షి' చిత్రం నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ. 24.6 కోట్ల షేర్ రాబట్టింది. ఏపీ, తెలంగాణలో టాప్ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులతో కంపేర్ చేస్తే 'మహర్షి' చిత్రం 5వ స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు బాహుబలి 2, అజ్ఞాతవాసి, అరవింద సమేత, వినయ విధేయ రామ చిత్రాలు ఉండటం గమనార్హం. 


రూ. 42.74 కోట్ల షేర్ వసూలు చేసి 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది. రూ. 26.94 కోట్ల తొలి రోజు వసూళ్లతో అజ్ఢాతవాసి నెం.2 స్థానంలో ఉంది. రూ. 26.15 కోట్ల వసూళ్లతో అరవింద సమేత, రూ. 25.87 కోట్ల షేర్ సాధించి వినయ విధేయరామ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: