మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతలా అంటే ప్రతి సినిమా అవలీలగా వన్ మిలియన్ మార్క్ దాటేవిధంగా అయితే ఎందుకో గాని మహర్షి విషయంలో అలా జరగలేదు. అయితే దానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది. ఎలాంటి ఫౌండేషన్‌ లేకుండా కేవలం ఆఫర్లు, ఫ్రీ పాస్‌లు నేపథ్యంలో బిల్డ్‌ అయిన ఓవర్సీస్‌ బిజినెస్‌ ఎంపైర్‌ బీటలు వారుతోంది. నైజాం తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన ఓవర్సీస్‌లో, ముఖ్యంగా యుఎస్‌లో సడన్‌గా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.


కొంతకాలంగా సరిగా వసూళ్లు రాకపోతూ వుంటే సినిమాలు ఆకర్షించడం లేదని అనుకున్నారు కానీ మహర్షి చిత్రానికి ప్రీమియర్ల పరంగా కేవలం అర మిలియన్‌ డాలర్లు రావడంతో ఇది ఆకర్షణకి సంబంధించిన సమస్య కాదని తేలిపోయింది. స్పైడర్‌ చిత్రానికే మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన మహేష్‌ 'మహర్షి'కి ఎందుకని ప్రీమియర్‌ టాప్‌ 10 లిస్ట్‌లో కూడా మహర్షిని నిలబెట్టలేకపోయాడు? దీనికి కారణం సడన్‌గా ఎత్తేసిన ఆఫర్లేనని చెబుతోంది యుఎస్‌ ట్రేడ్‌.


ఇకపై మిలియన్‌ డాలర్ల ప్రీమియర్లు వుండవని, భారీ స్థాయిలో వసూళ్లు రావని కూడా అంటోంది. జెర్సీకి అంత గొప్ప టాక్‌ వచ్చినా కానీ వసూళ్లు చాలా మామూలుగానే వచ్చాయి. మహర్షికి ఓపెనింగ్స్‌ చాలా వీక్‌ వున్నాయి. ఇకపై ఇందుకు తగ్గట్టుగా ఇక్కడి బిజినెస్‌ని అడ్జస్ట్‌ చేసుకోవాల్సి వస్తుందని, మునుపటి చిత్రాలని బట్టి అమ్మాలని చూస్తే బయ్యర్లు దొరకరని విశ్లేషిస్తోంది. ఈ మార్కెట్‌లో కింగ్‌ అయిన మహేష్‌ సినిమాకే బిజినెస్‌ సగానికి పడిపోయినపుడు మిగతా వారి పరిస్థితి ఎలా వుంటుందనేది ఊహించుకోవడం కష్టమే సుమీ.

మరింత సమాచారం తెలుసుకోండి: