‘సైరా’ సెట్ కు భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఈమూవీ ఈసంవత్సరం విడుదల కాదేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే రామ్ చరణ్ మాత్రం ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున విడుదల చేయాలి అన్న పట్టుదలతో ఉండటమే కాకుండా ఆ దిశగా ‘సైరా’ టీమ్ ను పరుగులు తీయిస్తున్నట్లు టాక్. 

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించిన క్లైమాక్స్ ను ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసారు అని తెలుస్తోంది. అయితే ఈ క్లైమాక్స్ విషయంలో వాస్తవాలను యదార్ధంగా చూపెట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ క్లైమాక్స్ విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలు ఎదురుగా ఉరి తీసింది అని చరిత్ర కారులు చెపుతున్నారు.

అయితే చిరంజీవి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న టాప్ హీరో సినిమాలో క్లైమాక్స్ లో ఉరి సీన్ పెడితే అది అభిమానులు అంగీకరించరేమో అన్న సందేహాలు మొదట్లో మెగా కాంపౌండ్ కు వచ్చినా చరిత్రను యధాతదంగా తీయమని చిరంజీవి చెప్పడంతో చిరంజీవి పై ఆ ఉరి సీన్ ను షూటింగ్ ను కూడ పూర్తి చేసినట్లు టాక్. దీనితో ఈ సినిమా చిత్రీకరణ ఇంచుమించు పూర్తి కావడంతో ఈమూవీని ఇక ఆలస్యం చేయకుండా గాంధీ జయంతి రోజున విడుదల చేసే విధంగా చరణ్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. 

ఈసినిమా గ్రాఫిక్ వర్క్స్ ను విడివిడిగా విభజించి నాలుగు రష్యన్ కంపెనీలకు ఇవ్వడంతో వారు కూడ ఈ రిలీజ్ డేట్ కు ఒక నెల ముందుగానే ‘సైరా’ గ్రాఫిక్ వర్క్స్ ను పూర్తి చేస్తామని ఎగ్రిమెంట్ చేసినట్లు సమాచారం. ఈమూవీ ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు జీవితానికి సంబంధించింది కావడంతో పాటు వచ్చే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న పరిస్థుతులలో ఇలాంటి సందర్భం మళ్ళీరాదు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ‘సైరా’ ను అక్టోబర్ 2న విడుదల చేసి తీరాలి అన్న చరణ్ పట్టుదల ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: