అమెజాన్ ప్రైమ్ వీడియోలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది . అందరి కంటే ముందుగానే అమెజాన్ మూవీ రైట్స్ తీసుకుని తన వ్యాపారాన్ని కాంపిటేటివ్ గా మార్చుకుంది. ఏంతో మంది విఒడి(VOD) యూజర్లు అమెజాన్ ప్రైమ్ ప్రీమియంను తీసుకున్నారు. అమెజాన్ తన ఆన్ లైన్ మార్కెట్ మాత్రమే కాకుండా ఐటి, ఈ కామర్స్ రంగంలో కూడా దుసుకుపోతుంది.


సహజంగా అమెజాన్ ప్రైమ్ తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు తదితర భాషల్లో కొత్తగా వచ్చిన సినిమాల పై ద్రుష్టి పెడుతుంది. అదే విధంగా రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన చై-సామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “మజిలి” రైట్స్ కూడా తీసుకుంది. కానీ మజిలి సినిమా పైరసీ ప్రింట్, హెచ్.డి క్వాలిటీలో రిలీజ్ అవ్వడంతో అమెజాన్ తలపట్టుకుంది.

Image result for naga chaitanya images

పైరసీ అరికట్టడానికి సినీరంగ సంస్థలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం మాత్రం ఉండడం లేదనే చెప్పాలి. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పైరసీ శాతం బాగా ఏక్కవనే చెప్పాలి. ఏంతో డబ్బులు పెట్టి అమెజాన్ ప్రైమ్ మజిలి సినిమాను కొనుగోలు చేసినా, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు .


మజిలి సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు, సామ్ సహజంగా నటించిందని చాల మంది అభినందించారు. ఈ కొత్త పెళ్లి జంట సినిమా చూడటానికి విదేశాల్లో కూడా చాల ఆసక్తి కనబరుస్తున్నారు. చేతులు కాలిన తరవాత ఆకులూ పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి . ఇప్పుడు అమెజాన్ పరిస్తితి కూడా అంతే అని చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: