హీరోయిన్ తాప్సి కొత్త సినిమాలతో దుసుకుపోతుంది. ఈ భామ తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ మిగతా యువ హీరోయిన్స్ తో పోటి పడలేకపోయింది. కానీ తన తెలివితేటలు, అభినయంతో బాలీవుడ్ లో అగ్ర తారలతో ప్రముఖ డైరేక్టర్లతో సినిమాలు చేసి శభాష్ అనిపించుకుంది.


ఈ సొట్ట బుగ్గల సుందరి ఇప్పుడు “గేమ్ ఓవర్” అనే సినిమాకు సంతకం చేసింది. ఈ సినిమా మూడు బాషలలో తెరకేక్కబోతుంది. ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో తాప్సి వీడియో గేమ్ డేవలపర్ పాత్రలో నటిస్తుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ సినిమా నేపద్యంలో ఉంటుంది.

Image result for tapsee images

ఈ చిత్రాన్ని మాయ సినిమా ఫేం అశ్విన్ సారవాన డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులి జరుగుతున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, మరియు హిందీ భాషల్లో విడుదలకానుంది.


తెలుగులో తాప్సి చివరిగా నటించిన సినిమా “ఆనందో బ్రహ్మ”. ఈ సినిమా మంచి కలెక్షన్స్ సంపాదించింది. తాప్సి కూడా మంచి పాత్రలో నటించింది. ఇది కూడా హర్రర్ థ్రిల్లర్ సినిమా కదే. మొత్తానికి తాప్సి హారర్ సినిమాలు ఏక్కువగా చేస్తుంది. ‘గేమ్ ఓవర్' చిత్రంలో సిద్ధార్ద్ హీరోగా చేస్తున్నాడు. సిద్ధార్ద్ కి కుడా తెలుగు ఇండస్ట్రీలో అంత హిట్టులు లేవు. ఈ సినిమా డైరెక్టర్ ‘లవ్ ఫెయిల్యూర్’, గురు వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: