"కృష్ణ గాడి వీర ప్రేమ గాధ" సినిమాతో వెండితెరకు పరిచయమైంది "మెహ‌రీన్ కౌర్‌". హను రాఘవపూడి దర్శకత్వలో నేచురల్ స్టార్ నానీ కి జోడీగా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత మెహ‌రీన్ వ‌రుసగా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే ఆమె నటించిన జవాన్, పంతం, కవచం సినిమాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అవ‌కాశాలు తగ్గాయి. అయితే అనుకోకుండా మెహ‌రీన్‌కు ఈ ఏడాది ఎఫ్‌2 రూపంలో మంచి హిట్ పడింది. 


దాంతో ఇప్పుడు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా మెహ‌రీన్‌ రెండు సినిమాల‌కు సైన్ చేసింది. అందులో ఒక‌టి పంజాబీ సినిమా. మ‌రోటి గోపీచంద్‌, తిరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోకి జోడీగా నటించనుందని లేటెస్ట్ అప్‌డేట్.
 
తేజ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమాలో నాగ‌శౌర్యతో కలిసి మెహ‌రీన్‌ రొమాన్స్ చేయబోతోందట. నాగ‌శౌర్య సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌లో తెర‌కెక్క‌నుండగా రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు మెహ‌రీన్‌కు స్టోరి వినిప్పించాడట‌. కథ నచ్చి మెహరీన్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక త్వరలో ఈ సినిమా కు సంబధించిన మిగతా విషయాలను అధికారకంగా వెల్లడించనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: