సల్మాన్ ఖాన్... వయసు చూస్తే 50 దాటింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆమధ్య ఎప్పుడో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని సల్మాన్ పెద్దగా పట్టించుకోలేదు. కెరీర్లో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు సరే ... ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు కదా... పెళ్లి మాటెత్తితే నో కామెంట్ అని తప్పించుకుంటున్నాడు.

ఎందుకు ఏంటి అనే విషయాలు సల్మాన్ కు తప్పిస్తే ఎవరికీ తెలియవు. ఇప్పుడు హీరోలు చాలామంది సల్మాన్ బాటలోనే నడుస్తున్నారు. ఉదాహరణకు ఏక్తా కపూర్. పెళ్లి చేసుకోకుండానే సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మను ఇచ్చింది.


చాలామంది సెలెబ్రిటీలు ఈ విధానం ద్వారా బిడ్డలకు తల్లిదండ్రులు అవుతున్నారు. మనదేశంలో లీగల్ గా ఇది అప్రూవ్ చేయడంతో ఈ విధానం మరింత స్పీడ్ ను అందుకుంది. ఇదే బాటలో సల్మాన్ కూడా నడవబోతున్నారని వినికిడి.

సల్మాన్ కు పిల్లలంటే చాలా పిచ్చి ప్రేమ. మనసులో తనకు పిల్లలు కావాలనే ఆలోచన వచ్చినట్టుంది. ఆ విషయాన్నీ కుటుంబ సభ్యులతో కూడా సల్మాన్ మాట్లాడినట్టు సమాచారం. డాక్టర్ ను కూడా సంప్రదించారని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే... త్వరలోనే జూనియర్ సల్మాన్ ను చూడొచ్చన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: