టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల..మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’తీశారు.  అయితే ఈ సినిమాకు కూడా కుటుంబాల మద్య ఉన్న దూరాన్ని దగ్గర చేసే కాన్సెప్ట్ తో ఉన్నా..తెలుగు ప్రేక్షకులకు మాత్రం పెద్దగా రుచించలేదు. దాంతో ఆ ఏడాది భారీ డిజాస్టర్ మూవీలో ఇదే నెంబర్ వన్ పొజీషన్లో చేరింది.  అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు.  అయితే మంచి కథతో ఈసారి తానేంటో ప్రూవ్ చేసుకుంటానని అంటున్నాడు ఈ ఫ్యామిలీ దర్శకుడు.


ఇక టాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోగా చిన్న నిర్మాతలకు సూపర్ హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని ఈ మద్య ‘జెర్సీ’సినిమాతో మరో ఘన విజయాన్ని అందుకున్నారు.  ప్రస్తుతం నాని 'గ్యాంగ్ లీడర్' పై దృష్టిపెట్టాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రాజెక్టును కూడా నాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.


ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఫ్యామిలీ దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.  ఇటీవల నానీని కలిసి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. మరి ఈసారి నాని మంచి ఫ్యామిలీ మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఎంట్రటైన్ మెంట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: