'ఆర్ ఎక్స్ 100' హిట్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించడమే కాకుండ తన గురువు రాం గోపాల్ వర్మ లాగా మొదటి సినిమాతోనే కాంట్రవర్సీలను ఎదుర్కొన్న దర్శకుడు అజయ్ భూపతి. కేవలం తను అనుకున్న"RX100"టైటిల్ కోసమే ఎంతో పట్టు పట్టి సాధించాడంటేనే అజయ్ ఎంత మొండివాడో అర్థమవుతుంది. కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ లను హీరో హీరోయిన్స్ గా తెరకకెక్కించిన "RX100"సినిమాతో అటు హీరో కార్తికేయ ఇటు హీరోయిన్ పాయల్ భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజి బిజీగా ఉన్నారు.

కానీ వీరికి ఇంత ఫేం ని తీసుకొచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం హీరోల వెంట తెగ తిరుగుతున్నాడు. "RX100"సినిమా రిలీజైనప్పట్నుంచే ఈ డైరెక్టర్ కి ఇండస్ట్రీలో బోలెడన్ని అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. వాళ్ళతో పాటే అజయ్ కూడా అదే కల కన్నాడు. కానీ ఇంత వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్, నాగ చైతన్య, నితిన్...ఇలా యంగ్ హీరోస్ తో అజయ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు షికారు చేశాయి. 


అయితే ఇప్పుడు అవేవి నిజం కాదని అంటున్నారు. ప్రస్తుతం అజయ్ భూపతి మాస్ మహారాజా రవితేజ కి కథ వినిపించాడని ఈ కథ నచ్చి రవితేజ అజయ్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని లేటెస్ట్ అప్‌డేట్. ఇదే గనక నిజమైతే అజయ్ లక్కీనే.    


మరింత సమాచారం తెలుసుకోండి: