‘మహర్షి’ మూవీకి  రెండోరోజు కూడా  వసూళ్ల వరద పారింది. సినిమా గురువారం విడుదల కావడం పబ్లిక్ హాలిడే లాంటివి ఏమీ లేకపోవడంతో ఓవరాల్ కలెక్షన్ల విషయంలో 5వ స్థానంతో మహర్షి సరిపెట్టుకున్న ఈఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి ఈమూవీ కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమా పై వస్తున్న విమర్శలకు సరైన సమాధానాలు ఇచ్చే పని చేపెట్టాడు వంశీ పైడిపల్లి.   

ముఖ్యంగా ఈసినిమా ఫస్టాఫ్ కు సెకండాఫ్ కు అసలు సంబంధం లేదని ప్రేక్షకులకు ఒక టికెట్ పై  2సినిమాలు చూసిన ఫీలింగ్  కలుగుతోంది అంటూ వస్తున్న విమర్శకుల పై దర్శకుడు వంశీ పైడిపల్లి ఘాటైన సమాధానం ఇచ్చాడు. ‘మహర్షి’ సినిమా చూస్తే రెండు సినిమాలు చూసినట్టు ఉంటోంది   అన్న అభిప్రాయం గురించి మాట్లాడుతూ ఈలోపం స్క్రీన్ ప్లే వల్ల ఏర్పడింది కాదని కథ పెద్దగా ఉండడం వల్ల ఈ సినిమా చూస్తున్న వారికి ఆ అభిప్రాయాలు వచ్చి ఉంటాయి అంటూ వంశీ పైడిపల్లి కామెంట్స్ చేసాడు.  

అంతేకాదు ఈసినిమాలో ఫస్టాఫ్ లో ఓ బ్యాక్ డ్రాప్  లో ఉంటూ  సెకెండాఫ్ లో మరో బ్యాక్ డ్రాప్ ఉండటమే కాకుండా సెకండాఫ్ లో వచ్చిన బ్యాక్ డ్రాప్ ను ఫస్టాఫ్ లో చూపించక పోవడంతో సగటు ప్రేక్షకులకు ఈ కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది అన్న అభిప్రాయం వంశీ వ్యక్త పరిచాడు. అంతేకాదు ఈసినిమా పై రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ సగటు ప్రేక్షకుడు ఈ సినిమా గురించి ఏమి అనుకుంటున్నాడనేదే ముఖ్యం అంటూ ‘మహర్షి’ పై వచ్చిన నెగిటివ్ రివ్యూలను తాను పట్టించుకోను అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 

దీనికితోడు  సినిమాలో లేయర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డ్యూరేషన్ కూడా పెరిగిందని అంటూ   ఈసినిమాలో కొన్ని సన్నివేశాల్ని తొలిగిస్తారంటూ వచ్చిన వార్తలను వంశీ పైడిపల్లి ఖండించాడు.  అంతేకాదు ఈరోజు నుండి థియేటర్లు కూడా పెంచుతున్న విషయాన్ని వివరిస్తూ మహేష్ కెరియర్ లో ఈమూవీ ల్యాండ్ మార్క్ మూవీగా మారిపోతుంది అని అంటున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: