సెల‌బ్రిటీలు అంటే ట్రోల్స్‌ను త‌ప్పించుకోవ‌డం అసాధ్యం. ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా ఉన్న వారు ఏదో ఒక సంద‌ర్భంలో నెటిజ‌న్ల నుంచి స‌హ‌జంగానే ట్రోల్‌కు గుర‌వుతుంటారు. అయితే ప‌నిపాటా లేని వారిలో చాలా మంది స‌క్సెస్‌లోనూ, ఫెయిల్యూర్స్‌లోనూ ట్రోల్స్ చేస్తూనే కాలం గ‌డుపుతూ ఉంటారు. ఇక తాజాగా మ‌హ‌ర్షి హిట్‌ను మ‌హర్షి సినిమా యూనిట్‌తో పాటు మ‌హేష్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తోంది. మ‌హర్షి స‌క్సెస్‌లో మ‌హేష్ వ‌రుస పార్టీలు చేసుకుంటున్నాడు.


ఇటు పార్టీల‌తో పాటు అటు త‌న ఫ్యామిలీకి స్పెష‌ల్ షో కూడా వేశాడు. ఇక సినిమా యూనిట్‌తో పాటు త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో మ‌రో పార్టీలో ఎంజాయ్ చేశాడు. ఇక న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మ‌హ‌ర్షి సెల‌బ్రేష‌న్స్ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ సెల‌బ్రేష‌న్స్ ఇంట్లో జ‌ర‌గ‌డంతో ఆమె చాలా క్యాజువ‌ల్ లుక్‌లో క‌నిపించారు.


దీనిపై ఓ నెటిజ‌న్ న‌మ్ర‌తా నువ్వు మేక‌ప్ ఎందుకు వేసుకోవ‌డం లేదు... నువ్వేమైనా డిప్రెషన్ తో బాధ పడుతున్నావా ? అని సెటైర్ వేశాడు. ఈ వ్య‌గ్యాంస్త్రానికి న‌మ్ర‌త ఆ నెటిజ‌న్‌కు చెప్పుతో కొట్టిన‌ట్టు ఆన్స‌ర్ చేసింది. మేక‌ప్‌తో ఉన్న మ‌హిళ‌లు నీకు న‌చ్చుతేరేమో ? అందుకే నువ్వు ఎప్పుడూ మేక‌ప్ వేసుకునే వారినే ఫాలో అవ్వు... ఈ పేజ్‌లో అలాంటివి ఉండ‌వంటూ సూప‌ర్ పంచ్ ఇచ్చింది. న‌మ్ర‌త‌కు మ‌ద్ద‌తుగా ప‌లువురు నెటిజ‌న్లు కౌంట‌ర్లు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: