విక్టరీ వెంకటేష్ ఏఫ్2 తో పెద్ద హిట్ కొట్టాడు. వెంకటేష్ అనగానే గుర్తుకొచ్చేది కామెడీ అండ్ ఫ్యామిలీ మూవీ. ఏఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదానికి కూడా కారణం అదే. తెలుగు ఆడియన్స్ కు వెంకి బాగా కనెక్ట్ అవతాడు. వెంకి సినిమా వచ్చిందంటే మంచి సినిమా వచ్చినట్లే. బాబు బంగారం, గురు లాంటి వైవిద్యమైన క్యారెక్టర్ లు చేసిన వెంకి మరోసారి ఏఫ్2లాగా మల్టీ స్టార్ మూవీలో కనిపించనున్నాడు.


విక్టరీ వెంకటేష్ చైతు కాంబినేషన్ లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానేర్ మీద బాబి దర్శకత్వంలో వెంకి మామ సినిమా ముందుకు రాబోతుంది. రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్ లైఫ్ లో కూడా మామ అల్లుడు గా అలరించనున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ సక్సెస్ ఫుల్ రైటర్ కోన వెంకట్ కధను అందించారు.

Image result for venkatesh images

చైతన్య, వెంకి మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇటివలే ఈ చిత్రం రెండోవ షెడ్యూల్ ను హైదరాబాదులో పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తరువాతి షెడ్యూల్ కాశ్మీర్ లో చేయబోతున్నారు. ప్రస్తుతం టీం కాశ్మీర్ లో సినిమా సన్నివేశాల కోసం మంచి లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారంట.


ఈ చిత్రంలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు చై ఆర్మీ ఆఫీసర్ గా కనిపించలేదు. ఈ చిత్రంలో నాగ చైతన్య కొత్త వేషంలో కనిపించబోతున్నట్లే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి ఇదొక ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా అలరించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: