ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కి సూపర్ హిట్ వచ్చిందంటే వెంటనే ఆఫర్లు క్యుకడతాయి. కానీ కొంత మందికి మాత్రం సీన్ రివర్స్ అవ్వోచ్చని అజయ్ భూపతిని చుస్తే తెలుస్తుంది. అజయ్ “RX100” లాంటి బోల్డ్ సినిమా తీసి హిట్ కొట్టాకా కూడా ఇంకా అవకాశాల కోసం పరిగెడుతున్నాడు. తన మొదటి సినిమా ఒక రియల్ లైఫ్ స్టొరీతో తెరకెక్కించారు ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది.


హీరో కార్తికేయను ఈ సినిమా ద్వార పరిచయం చేసారు. కొత్త డైరెక్టర్ అయినా చాల బాగా దర్శకత్వం చేసాడని పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో పాయల్ రాజ్ పుట్ కూడా మంచి అవకాశాలను సంపాదించుకుంటుంది. ఒక పక్క హీరోయిన్ గా మరో పక్క స్పెషల్ సాంగ్ లకు కూడా ఒకే చెప్పేసింది. కార్తికేయ కూడా మరో కొత్త సినిమా బోల్డ్ స్టొరీతో రాబోతున్నాడు.

Image result for karthikeya images

కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ఇంకా అవకాశం కోసం ఏదురు చూస్తూనే ఉన్నాడు. సమంత –నాగ చైతన్య జంటగా పోలీస్ డ్రామా తీద్దామని అన్ని రెడీ చేసుకున్న నేపద్యంలో చివరకు ఆ ప్రాజెక్ట్ ఒకే అవ్వలేదు. చైతు వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం సమంత కుడా తమిళ సినిమాలను ఒప్పుకోవడం చేత కాల్ షీట్ లు దొరకలేదంట.


చైతు, వెంకీ మామ సినిమా తరువాత చైతు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నడు. అలాగే సొంత బ్యానేర్ లో కూడా రామరాజు అనే సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది. ఇవన్నీ చూస్తుంటే అజయ్ భూపతికి అప్పుడే ఛాన్స్ దొరికేటట్టుగా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: