మన మల్టీ టాలెంటెడ్ ప్రభుదేవా మాస్టర్ డాన్స్ లోనే కాకుండా దర్శకత్వం, నటనతో కుడా అందరిని మెప్పిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ప్రభుదేవాకు మంచి పేరు ఉంది. ప్రభుదేవ ఒక విలక్షణమైన నటుడు అని అతని నటనను కూడా కొనియాడే వారు లేకపోలేదు. ప్రభుదేవా ఇప్పుడు నటుడిగా ఒక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.


ఈ సినిమాలో ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుంది. సినిమా పేరు “ఖామోషి”, రీసెంట్ గా ట్రైలర్ కుడా రిలీజ్ చేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో “అభినేత్రి” అనే సినిమా వచ్చింది కానీ అది సూపర్ హిట్ కాలేదు. ఆ స్టొరీ మాత్రం హిట్ అనే చెప్పాలి, బాక్స్ ఆఫీస్ వరకు వెళ్లకపోయినా “అభినేత్రి” సినిమా మాత్రం ఆడియన్స్ కు బాగా నచ్చిందనే చెప్పాలి. “అభినేత్రి” సినిమా కూడా హారర్ జోనర్ లోనే వెళ్ళింది. మళ్ళి దానికి దగ్గరలో ఉండే కధాంశంతోనే “ఖామోషి” సినిమా ఉండబోతుందట.

Image result for prabhu deva images

తమన్నా మొన్నటి వరకు గ్లామోర్ షోతో ఆధరగోట్టింది. ఏఫ్ 2 హిట్ తరువాత సినిమా ఇదే. ఈ కొత్త సినిమా హిందీలో విడుదల కానుంది. తెలుగులో కూడా రిలీజ్ చేస్తారని టీం చెప్తుంది. ఈ నెల 31వ తేదిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా కామెడీ లేకుండా కొంచెం సీరియస్ గా సాగతుందట. ఇందులో మన మిల్కీ బ్యూటీ మూగ అమ్మాయిగా కనిపించబోతుంది.


ఇదే రోజున అభినేత్రి -2 కూడా రిలీజ్ చేస్తున్నారట. ఇలా రెండు హారర్ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం. మొత్తానికి తమన్నా రెండు సినిమాలు ప్రభుదేవా జతగా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నయనమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: