సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి, మే 9వ తేదిన విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు, నరేష్ యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. చాలకాలం తరువాత అల్లరి నరేష్ కు మంచి పేరు తెచ్చిన సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు. మహర్షిలో హీరో క్యారెక్టర్ అయిన “రిషి” ని ఎంత వరకు గుర్తుపెట్టుకున్నారో అల్లరి నరేష్ క్యారెక్టర్ అయిన “రవి”ని కూడా అంతే గుర్తుపెట్టుకున్నారు ఆడియన్స్.


ఈ సినిమా లో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. సినిమా చుసిన తర్వాత అర్ధమైంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని. అల్లరి నరేష్ మంచి నటుడు, అతను చేసిన ఏన్నో సినిమాలు ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాయి. అందరి హీరోల కంటే సంవత్సరానికి ఏక్కువ సినిమాలు అల్లరి నరేష్ ఏ చేసేవారు. చిన్న సినిమాలైన మంచి గ్రాస్ తో అతని సినిమాలు ఆడేవి.


అల్లరి నరేష్ తండ్రి ఈవివి సత్యనారాయణగారు కాలం చేసిన తరువాత నరేష్ కు మంచి సినిమాలు రాలేదు. కెరీర్ లో కొంచెం మందుకోడిగా సాగింది. ఏంత ప్రయత్నించిన ఒక్క సరైన హిట్ కూడా రాలేదు. చాల కలం తరువాత మహర్షి సినిమా నరేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది.


దీనితో నరేష్ భావోద్వేగానికి గురి అయ్యారు. తన ట్విట్టర్ ఎకౌంటులో 17వ ఏట నుండి తన సినీ ప్రస్థానాన్ని నెమరు వేసుకున్నారు. తనని మళ్ళీ యాక్టర్ గా చూపించింది. మహర్షి సినిమాలో “రవి” క్యారెక్టర్ ఏ అని భావోద్వేగానికి లోనయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: