డైరెక్టర్ మారుతి అనగానే తక్కువ బడ్జెట్ లో యూత్ కు నచ్చే కధాంసాలతో హిట్ కొట్టే డైరెక్టర్ గా మంచి పేరు. అయితే చిన్న లెవెల్ లో సినిమాలు తీసే మారుతి ఒక్కసారిగా పరిణితి చెందిన డైరెక్టర్ లాగా విక్టరీ వెంకటేష్ తో “బాబు బంగారం” సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు. అప్పటి వరకు మారుతి కేవలం యూత్ సినిమాలు మాత్రమే తెయగలడనే మార్క్ ఉండేది, ఆ సినిమాతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. ఇక పెద్ద హీరోలు కుడా మారుతితో సినిమాలు చేయొచ్చు అనే స్థాయికి తీసుకుని వేల్లయనే చెప్పొచ్చు.


బాబు బంగారం సినిమా తరువాత మారుతి నాగ చైతన్యతో “శైలజ రెడ్డి అల్లుడు” సినిమా తీసారు. ఈ సినిమాలో రమ్య కృష్ణ, అనుఇమాన్యాల్ నటించారు. కానీ ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ కాలేదు, జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. మారుతికి మాత్రం మంచి పేరు వచ్చింది. ఏందుకంటే అతని దర్శకత్వంలో పరిణితి కనిపించింది. ఇంకొంచెం కధను ఫెయిర్ చేసుంటే సినిమా హిట్ కొట్టేదేమో అని ప్రేక్షకులే అభిప్రాయపడ్డారు.

Image result for sai dharam tej images

ఇదిలా ఉండగా, తాజాగా మారుతి సాయిధర్మ్ తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ కధాంశంతో ఉందబోతుందట. మారుతి అనగానే తన సినిమాలో కామెడీకి తప్పకుండా చోటుంటుంది. మిగతా సినిమాలు చుస్తే అర్ధమవుంది. కామెడీ లేకుండా మారుతి సినిమా తీయడు అనే టాక్ కూడా ఉంది. మొత్తానికి మారితి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ గా సాగే ఈ కధకి రావురమేష్ ని కూడా ప్రధానపాత్రలో తీసుకోన్నునట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: