రాజమౌళి మూవీ అంటేనే గ్రాండియర్ గా ఉంటుంది. ఆయన భారీతనానికి అటు కాసులు, ఇటు కాలం అలా కరిగిపోతూనే ఉంటాయి. జక్కన్న చెక్కుతూనే ఉంటాడని పేరు. ఏళ్ల తరబడి సినిమా తీసి వదిలితే అది ష్యూర్ గా  కాసులు కొల్లగొట్టి తీరాల్సిందే. ఇపుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ బిజీలో రాజమౌళి ఉన్నాడు. ఆయన అటు జూనియర్ ఎన్టీఆర్ తోనూ, ఇటు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తోనూ మల్టీ స్టారర్ ని భారీ ఎత్తున తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసే మూవీ. ఇందులో లేనిది ఏదీ లేదంటున్నారు.


ఈ మూవీకి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తాడని టాక్ నడుస్తోంది. ఇపుడు దానికి మరో న్యూస్ యాడ్ అయింది. అదేంటంటే స్వీటీ అనుష్క  కూడా ఈ మూవీలో పార్ట్ అవబోతోందట. పది నిమిషాల నిడివి గలిగిన ఆమె పాత్ర ఈ మూవీలో అతి కీలకమని చెబుతున్నారు. మరి అనుష్క కూడా వస్తే ఈ మూవీ ని బాహుబలి 3 అని అపుడే పేరు పెట్టేస్తున్నారు. వీరు కాకుండా బాలీవుడ్ లో టాప్ స్టార్శ్ కూడా ఆర్ ఆర్ ఆర్ లో కనిపిస్తారని కూడా టాక్ నడుస్తోంది.



ఇంకా అనౌన్స్ చేయని వారు కూడా ఈ మూవీలో ఉంటారని చెబుతూంటే జక్కన్న షూటింగ్ దశలోనే కిక్కు ఎక్కించేస్తున్నాడనిపిస్తోంది. ఎపుడెపుడా ఆర్ ఆర్ ఆర్ వస్తుందని అటు అభిమానులతొ పాటు, ఇటు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి క్రియేటివిటీకి శభాష్ అనాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: