వేసవి కానుకగా విడుదలైన ‘మహర్షి’ సినిమా విడుదలైన రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన చాలా మంది సినిమా చాలా పెద్ద సినిమా అంటూ దాదాపు మూడు గంటల సినిమా అని కామెంట్లో చేస్తున్న క్రమంలో ...కొంతమంది సినిమా నిడివి తగ్గించాలని విడుదల కాకముందే డైరెక్టర్ వంశీ కి మరియు నిర్మాత దిల్ రాజు కి సూచించినట్లు సమాచారం. అయితే వంశీ దిల్ రాజు మాత్రం సమస్య లేదు అసలు సినిమాకి కత్తెర పడకూడదు..ప్రతి సీన్ అర్ధమైన రీతిలో ఉండాలి అని అదే సినిమాకి బలం అవుతుందని అప్పట్లోనే డిసైడ్ అయ్యారట.

Image result for maharshi

మహేష్ కూడా సినిమాలో ఎటువంటి సన్నివేశానికి కత్తిరింపు ఉండకూడదని కాన్ఫిడెంట్గా చెప్పారట. అయితే ప్రస్తుతం సినిమా విడుదలయ్యాక కూడా ఇదే టాక్ ఉండటంతో త‌గ్గించే ప్ర‌స‌క్తి లేద‌ని అటు దిల్‌రాజు, ఇటు వంశీ పైడిప‌ల్లి ముక్త కంఠంతో చెబుతున్నారు. మ‌హ‌ర్షి లాగ్ అయ్యింద‌న్న విష‌యం ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టికి ఎప్పుడో వెళ్లిపోయింది.

Related image

అలాంటి కామెంట్లు వ‌స్తే రెండో రోజు నుంచే సీన్లు లేచిపోతాయి. కానీ… చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ప‌ని చేయ‌లేదు. ప్ర‌తీ సీనూ, ప్ర‌తీ పాత్ర డిటైల్డ్‌గా చెప్ప‌డంలో త‌ప్పులేద‌ని, అలాంట‌ప్పుడు సినిమా లాగ్ అవ్వ‌డం స‌హ‌జ‌మ‌ని, అలా డిటైల్డ్‌గా చెప్ప‌డం వ‌ల్లే… క్లైమాక్స్ ఆ రేంజులో పండింద‌న్న‌ది వాళ్ల వాద‌న‌. దిల్ రాజు అయితే.. అస‌లు సినిమా స్లో అవ్వ‌డం కామ‌నే అంటున్నాడు. ఫ‌స్ట్ ఆఫ్ స్పీడుగా సాగింద‌ని, క్లైమాక్స్ కూడా ప‌రుగులు పెట్టింద‌ని, మ‌ధ్య‌లో కాస్త లాగ్ ఉంటే.. ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నాడు. మొత్తం మీద మహేష్ బాబు సినిమా ఎంత పెద్దదైన గానీ కచ్చితంగా హిట్ అవుతుందని ముందు నుండే కాన్ఫిడెంట్ గా మహేష్ ఉండటం బట్టి సినిమాపై మహేష్ కి మంచి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది సినిమా అందుకే బ్లాక్ బస్టర్ అయిందని అంటున్నారు సినిమా విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: