వెంకటేష్ హ్యాట్రిక్ వార్తలతో ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ‘ఎఫ్ 2’ తరువాత వెంకీ నటించిన మరొక సినిమా ఇంకా విడుదల కాకపోయినా వెంకటేష్ ఎవరూ ఊహించని విధంగా ఒక విచిత్రమైన హ్యాట్రిక్ సాధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గెస్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండస్ట్రీ సెంటిమెంట్ ప్రకారం వెంకటేష్ అతిధిగా ఒక ఫిలిం ఫంక్షన్ కు వచ్చాడంటే చాలు ఆమూవీ సూపర్ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. 

వెంకటేష్ హ్యాట్రిక్ విషయానికి సంబంధించి వివరాలలోకి వెళితే వెంకీ చీఫ్ గెస్ట్ గా తన మేనల్లుడు నాగచైతన్య నటించిన ‘మజిలీ’ ఫంక్షన్ కు వచ్చాడు ఆమూవీ హిట్ అయింది. ఆతరువాత నాని నటించిన ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చాడు ఆమూవీ కూడా సూపర్ హిట్ అయింది. 

లేటెస్ట్ గా వెంకీ మళ్ళీ మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చాడు. ఈమూవీ విడుదలైన తరువాత విమర్శకుల ప్రశంసలు లభించకపోయినా ఈమూవీ కలక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ నెట్ కలక్షన్స్ ఈరోజుతో పూర్తి అయ్యే వీకెండ్ తో 60 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది అని అంటున్నారు. 

దీనితో వెంకటేష్ ను గెస్ట్ గా పిలిస్తే చాలు ఆమూవీ సూపర్ హిట్ అంటూ ఒక ముద్ర వేసారు. ఇప్పుడు వెంకీ కొనసాగుతున్న మ్యానియా రీత్యా ఈనెల 24న విడుదల కాబోతున్న హాలీవుడ్ ఫాంటసీ మూవీ ‘అల్లాడిన్’ తెలుగు డబ్బింగ్ కూడ కలక్షన్స్ సునామీ సృష్టిస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమాలో నటించిన విల్స్ మిత్ జీని పాత్రకు వెంకటేష్ డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఈమూవీ ప్రమోషన్ ను నిన్నటి నుండి వెంకటేష్ ప్రారంభించడంతో ఈమూవీ కూడ ఈ సమ్మర్ సీజన్ లో కలక్షన్స్ సునామి సృష్టిస్తుంది అంటూ ఒక కొత్త సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకు వస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: