‘మహర్షి’ మహేష్ కు కలక్షన్స్ రికార్డుల రీత్యా సరికొత్త సంచలనాలను  ఎంతవరకు సృష్టిస్తుందో తెలియకపోయినా ఈమూవీకి ప్రస్తుతం వస్తున్న కలక్షన్స్ ను బట్టి ఈమూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ లిస్టులోకి చేరుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కి చేరుతుందా లేదా అన్న విషయమై రేపటి రోజున ‘మహర్షి’ కి ఎదురౌతున్న మొదటి సోమవారం పరీక్ష ఫలితాలను బట్టి రికార్డులు ఆధారపడి ఉంటాయి అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు ఏర్పడిన పాజిటివ్ టాక్ ను మరింత కొనసాగించడానికి ఈవారం ‘మహర్షి’ విజయోత్సవ సభ విజయవాడలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫంక్షన్ విజయవాడ కృష్ణానది తీరంలో కనీవిని ఎరుగని రీతిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు  సమాచారం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అనుమతి దొరకకపోతే లయోలా కాలేజీ గ్రౌండ్ ని కూడా ఆప్షన్ గా పెట్టుకున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి అంతకన్నా ముందుగా ఈ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన సెక్యూరిటీని అందించడానికి తమ వద్ద ఉన్న పోలీస్ ఫోర్స్ సరిపోదు అన్న కారణం వల్ల ఈ ఫంక్షన్ కు పోలీస్ శాఖ అనుమతుల విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఈ ఫంక్షన్ నిర్వహిస్తే ఫలితం ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడితే విజయవాడ బదులు హైదరాబాద్ లోనే ఈ ఫంక్షన్ చేసే ప్రతిపాదన కూడ పరిశీలిస్తున్నట్లు టాక్. 

ముఖ్యంగా మహేష్ నటించిన 25 సినిమాల దర్శక నిర్మాతలను సన్మానించడం ఈ కార్యక్రమం ప్రధాన హైలెట్. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రీత్యా బయటకు రాలేకపోతున్న సూపర్ కృష్ణను ఎదో విధంగా ఈ ఫంక్షన్ కు తీసుకు రావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వీకెండ్ కు ‘మహర్షి’ 60 కోట్ల నెట్ కలక్షన్స్ మార్క్ ను అందుకోవడం ఖాయం అయినా కనీసం ఇంకా మరో 40 కోట్లు నెట్ కలక్షన్స్ వస్తే కాని ‘మహర్షి’ బయ్యర్లు నష్టాలు లేకుండా బయటపడలేరు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రేపటి ‘మహర్షి’ సోమవారం రిజల్ట్ అత్యంత కీలకంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: