ఒక్క సీన్.. ఒక్క డైలాగ్ సినిమా భవితవ్యాన్ని మార్చేస్తాయంటే అతిశయోక్తి కాదు.. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేసేందుకు కథను జస్టిఫై చేసేందుకు అలాంటి సీన్లు ఒకటి రెండు ఉన్నా సరే సినిమాను నిలెడతాయంటున్నారు పరుచూరి బ్రదర్స్. 


అందుకు ఉదాహరణగా కర్తవ్యం సినిమాను చూపిస్తున్నారు వారు. విజయశాంతి కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయే చిత్రమిది. ఆమెను అమాతం హీరోను చేసేసిన మూవీ. ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు ఆమె తండ్రిగా కూడా నటించారు. 

ఈ సినిమాలో హీరోయిన్ మీనా విజయశాంతి మాస్టారి కూతురుగా నటించింది. కొందరు దుర్మార్గులు మీనాను రేప్ చేస్తారు. ఆ తర్వాత విజయశాంతి తన శక్తియుక్తులతో ఆమెను రేప్ చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపిస్తుంది. ఈ సీన్స్ సినిమాకు ప్రాణంగా నిలుస్తాయంటున్నారు పరుచూరి. 

ఇలాంటి సీన్ల సృష్టి కోసం పరుచూరి బ్రదర్స్ నిత్యం ఘర్షణపడుతుంటారట. అలా ఘర్షణపడిన ప్రతీసారీ క్షీర సాగర మథనం జరుగుతూనే ఉంటుంది. అలా మాట్లాడుకుంటేనే మంచి సీన్లు పుడతాయి. కర్తవ్యం సినిమాలో మీనాని మానభంగం చేసే సన్నివేశాన్ని ముందు అనుకోలేదు. మా చర్చల మధ్య పుట్టిందే. ఆ సీన్‌ లేకపోతే.. ఇప్పుడు కర్తవ్యం సినిమానే ఉండదు అంటూ గత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు పరుచూరి బ్రదర్స్ 



మరింత సమాచారం తెలుసుకోండి: