వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "సూపర్ స్టార్" మహేష్ బాబు తన 25 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది "మహర్షి". ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే మరో పాత్రలో అల్లరి నరేష్ నటించారు. ముగ్గురు అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, అశ్వనీ దత్, పి.వి.పి కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రారంభనైప్పటి నుంచే అటు మహేష్ అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ఎందుకంటే "భరత్ అనే నేను" సినిమా మహేష్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టి తను నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇదే ఉత్సాహంతో వంశీ పైడి పల్లి కథ చెప్పగానే అద్భుతంగా అనిపించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ట్రైలర్స్, సాంగ్స్ తో చిత్ర బృందం ఎప్పటికప్పుడు మహర్షి సినిమా పై భారీగా అంచనాలను పెంచడంతో ప్రేక్షకులంతా ఈ సినిమా ఓరేంజ్ లో ఉంటుందని, మహేష్ గతంలో సృష్ఠించిన తన రికార్డ్స్ ను తనే బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. 


అందరూ అనుకునంట్టుగానే ఈ సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. యావరేజ్ టాక్ అని అనుకున్న ప్రేక్షకులందరికి డైరెక్టర్ వంశీ పైడి పల్లి షాక్ ఇచ్చాడు. సూపర్ స్టారా మజాకా ఒక్కసారి మైండ్‌లో ఫిక్సైతే బ్లైండ్ గా రికార్డులు బద్దలవ్వాల్సిందే. "ఎప్పుడొచ్చామన్నది కాదు...బుల్లెట్ దిగిందా లేదా"...అని ఈ సినిమా రికార్డ్స్ చూసి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అంటున్న మాట. అంతేగా మరి... సైలెంట్‌గా రికార్డ్స్ బద్దలు కొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా...


మరింత సమాచారం తెలుసుకోండి: