గత కొద్దీ రోజులుగా పవన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఒక భారీ నిర్మాణ సంస్థ తీయబోయే సినిమాలో నటిస్తాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ వార్తలు నిజం అయితే బాగుండును అంటూ పవన్ అభిమానులు కూడ కోరుకుంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో నాగబాబు ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ పవన్ సినిమాల రీ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'జనసేన' తరఫున నరసాపురం నుండి పోటీ చేసిన నాగబాబు ఆ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తనకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టిన 'జబర్దస్త్' షోకు కూడ దూరంగా ఉంటున్నాడు.

ఈ సందర్భంలో నాగబాబు మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ జమున కృష్ణ చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చిన తరువాత కూడ సినిమాలు చేసిన విషయం వాస్తవమే అయినా అదే పద్ధతిని అనుసరిస్తూ పవన్ సినిమాలలో నటిస్తాడని ఒక రూల్ గా తాను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి పవన్ రాజకీయాలు చేస్తూ సినిమాలలో నటించనని గతంలో చెప్పాడనీ అయితే ప్రస్తుతం పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తనకు తెలియవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు మెగా బ్రదర్. 

పవన్ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తే తన అభిప్రాయంలో పవన్ రెండు పడవల ప్రయాణం చేయడని తన అభిప్రాయం అనీ అయితే రేపు ఏమి జరుగుతుందో తాను ఊహించ లేననీ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్దేశ్య పూర్వకంగా పవన్ ను విమర్శిస్తున్నారని అటువంటి వ్యక్తులను తాను లెక్క చేయనని పవన్ ను ఎంత డి గ్రేడ్ చేస్తే 100 రేట్లు పైగా పైకి లేస్తాడనీ పవన్ ఆవేశం ఆలోచనలు చాలా కొద్దిమందికి మాత్రమే ఉంటాయి అంటూ తన తమ్ముడు పై మరొకసారి తన అభిమానాన్ని వ్యక్తరుచుకున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: