బుల్లితెర యాంకర్ గా రెండు దశాబ్దాల పాటు అపూర్వ విజయాలతో కొనసాగుతున్న సుమ సృష్టించిన రికార్డులు మరో బుల్లితెర యాంకర్ ఇప్పట్లో అందుకునే అవకాశం లేదు. కేరళా నుండి వచ్చిన సుమ తెలుగు వారి కోడలుగా మారి తెలుగు భాషను ఆమె స్పష్టంగా మాట్లాడే స్థాయిలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మరి ఏ తెలుగు యాంకర్ మాట్లాడలేదు. 

ఒక బుల్లితెర యాంకర్ కు ఒక స్టార్ సెలెబ్రెటీ హోదా రావడం ఒక్క సుమకు మాత్రమే చెల్లింది. ఇలాంటి పరిస్థుతులలో నటుడు సుమ భర్త అయిన రాజీవ్ కనకాల సుమ కెరియర్ పై అదేవిధంగా ఆమె అందుకుంటున్న పారితోషికాల స్థాయి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చాలామంది అనుకుంటున్నట్లుగా సుమకు అత్యంత భారీ పారితోషికాలు ఎవరు ఇవ్వరని ఒక్క బుల్లితెర షోను హోస్ట్ చేసే వ్యక్తికి అత్యంత భారీ పారితోషికాలు ఇచ్చి ఆ షోను ఎలా లాభసాటిగా నడపగలుగుతారు అంటూ రాజీవ్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. 
అంతేకాదు సుమ ఎదుగుదల వెనుక తన సహకారం ఏమీ లేదనీ ఆమె ఎదుగుదల అంతా ఆమె స్వయం కృషితో వచ్చింది అంటూ కేవలం తమ దేవదాసు కనకాల కోడలు అన్న విషయం పరిచయం చేయడానికి మాత్రమే సరిపోయింది అంటూ కామెంట్స్ చేసాడు.  అంతేకాదు సినిమా షూటింగ్ లలో లైట్ల మధ్య ఐదు నిముషాలు షాట్ లో నటించడానికే అలిసిపోతామనీ అయితే రోజుకు కొన్ని గంటల చొప్పున కొన్ని వందల లైట్ల మధ్య వరసగా రెండు మూడు గంటలు నుంచుని షోను నిర్వహించే వ్యక్తికి ఎంతో ఓర్పు ఉండాలని ఆ ఓర్పు వలెనే సుమ టాప్ యాంకర్ గా మారింది అంటూ కామెంట్స్ చేసాడు. 
సుమ ఒక ఆడియో ఫంక్షన్ కు తీసుకునే పారితోషికం గంటకు కొన్ని లక్షలలో ఉంటుందని ప్రచారం చేస్తున్నారనీ తనకైతే ఆ వార్తలలోని నిజం తనకు తెలియదు అంటూ సుమ ఎంత సంపాదిస్తోంది అన్న విషయం తానెప్పుడూ ఆమెను అడగనని అలా అడిగే ఉద్దేశ్యం కూడ తనకు లేదని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు తన భార్య సంపాదన పై పెత్తనం చేయాలి అన్న కోరిక తనకు లేదనీ జీవితంలో తామిద్దరం భార్య భర్తలం అయినా ఎవరి కెరియర్లు వారికి ఉన్నాయని అంటూ రాజీవ్ తన భార్య సుమ కష్టం గురించి అదేవిధంగా ఆమె సమర్ధత గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: