వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మీద ఇప్పటి వరకు చాల మంది ప్రముఖులు ప్రసంశలు కురిపించారు. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. రైతుల కధాంశం, కమర్షియల్ హంగులతో, ఆడియన్స్ అంచనాలను సరిగ్గా రీచ్ అయిన సినిమా మహర్షి.


మహర్షిలో ప్రిన్సు మహేష్ బాబు తన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. ఆడియన్స్ పై ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండు, మూడు సార్లు చుసిన వాళ్ళు కూడా ఉన్నారు. మహర్షి సినిమా మొదుటి నుండి ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మహేష్ కు బెస్ట్ విషెస్ తెలుపుతూ వీడియో బైట్లు చేయడం అందరికి విదితమే.

Image result for allari naresh  images

అలానే అల్లరి నరేష్ ఎమోషనల్ ట్వీట్, ఫ్యాన్స్ రియాక్షన్ తో మొత్తం సోషల్ మాధ్యమాలన్నీ మహర్షి టాక్ తోనే నిండిపోయింది. సినిమా హిట్ అవ్వక ముందు నుండి టీజర్, ట్రైలర్స్ తో అభిమానులు చాల హడావిడి చేసారు. ఇంక హిట్ అయ్యిన తరువాత దాని మీద డిస్కషన్స్, కలెక్షన్స్ గురించి టాక్ మొదలైంది.


ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు మహర్షి టాక్ చేరిందంట. ఏప్పుడు సోషల్ యాక్టివిటీస్ లో బిజీగా ఉండే ఆయన సాధారణంగా అతని సినిమాలే ధియేటర్ లో చూడరు అలాంటిది మహర్షి సినిమాలో రైతుల సబ్జెక్టు కోసం చూడాలని అనుకుంటున్నారట పవన్. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఏంతో మంది సినీ ప్రముఖులు చూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.

ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో అలరించారు . దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: