మే 9 వ తేదీన రిలీజైన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.  మహేష్ కెరీర్లో బెస్ట్ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది.   లాంగ్ రన్ లో మహర్షి మిగతా చోట్ల కూడా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.  


ఈ సినిమాను ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు మెచ్చుకున్నారు.  మెగాస్టార్ చిరంజీవి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.  సినిమా అద్భుతం అని కొనియాడారు.  రైతు సమస్యల గురించి ప్రస్తావించడమే కాకుండా, దానికి మహర్షి ఇచ్చిన సొల్యూషన్ బాగుందని మెగాస్టార్ చెప్పిన సంగతి తెలిసిందే. 


ఇదిలా ఉంటె, మెగాస్టార్ బాటలో పవర్ స్టార్ కూడా నడవబోతున్నారు.  మహేష్ మహర్షి సినిమాను చూసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.  వీలుచూసుకొని త్వరలోనే సినిమా చూస్తారట.  రైతులకు సంబంధించిన ఎలాంటి సమస్యలను చూపించారు.  ఆ సమస్యలకు మహర్షి ఎలాంటి సమాధానం ఇచ్చారు అనే విషయాలను తెలుసుకోవడానికి పవన్ ఆసక్తి చూపిస్తున్నారు.  


పూజా హెగ్డే, అల్లరి నరేష్ పాత్రలకు మంచి పేరు వచ్చింది.  మహేష్ కు అలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అల్లరి నరేష్ కు అంతే పేరు వచ్చింది.  ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ తిరిగి గాడిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: