స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో సన్నాఫ్ సత్యమూర్తి ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు త్రివిక్రం. అలాగే ఈ సారి కూడా బన్నీతో తీస్తున్న కొత్త సినిమా కూడా నాన్న సెంటిమెంట్‌తోనే తెరకెక్కిస్తున్నాడని సమాచారం.


అయితే ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సుకుమార్ చిత్రం కాగా మరొకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే మరో చిత్రం. అయితే వీటిలో సుకుమార్-అల్లు అర్జున్ సినిమా ఓపెనింగ్ మే 11 న అధికారికంగా లాంచ్ చేస్తారని అన్నారు. మరి ఎందుకనో ఈ సినిమా లాంచ్ అవలేదు. అందుకు మెగా ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ఉందా..లేదా అని సందేహ పడుతున్నారట. 


ప్రస్తుతం బన్నీ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్లో ఉండగా సుకుమార్ మాత్రం బన్నితో చేయబోయో సినిమా స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతూ, పక్కగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. అంతేకాదు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సుక్కు తెరకెక్కించిన రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తీయడానికి, బన్నీ ని ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా స్క్రీన్ పై ప్రజ్రంట్ చేయడానికే ఎక్కువ టైం  తీసుకుంటున్నాడని సమాచరం. సో మెగా ఫ్యాన్స్ డోంట్ వరీ...బన్నీ-సుక్కు కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: