తెలుగు ప్రేక్షకులకు ఈటీవిలో వస్తున్న జబర్దాస్ట్ కార్యక్రమం గురించి వేరే చెప్పనవసరం లేదు. దానిలో రాకింగ్ రాకేశ్ టీంలో ఉన్న ముద్దులొలికే పిల్లలలో దీవేన ఒక పాప. తన అల్లరితో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరిస్తుంది దీవెన. ప్రతి ప్రోమోలోను దీవెన కచ్చితంగా ఉంటుంది. అందుకే ముద్దుగా దమ్ము దీవెన అని పిలుస్తారు అందరూ. దీవెన జబర్దాస్ట్ లో మాత్రమే కాదు యుట్యూబ్ లో కూడా దమ్ము దీవెనగా మంచి గుర్తింపు ఉంది.


ఈ చిన్నారి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు శిరీష్ సినిమాలో ఒక రోల్ చేయబోతుందట. అల్లు శిరీష్ కొత్త సినిమా ABCDలో దీవెన కూడా నటించిందట. దీవెన పక్కింట్లో వాల్ల పాప కింద నటించిందట. అల్లు శిరీష్ మాట్లాడుతూ ఈ చిన్నారి చాల బాగా నటించిందని జబర్దస్త్ లో కుడా దీవెన స్కిట్లు తనకు చాల ఇష్టం అని చెప్పాడు.


Image result for allu sirish jabardasth deevena

ఈ సినిమాలో మన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ హీరో కి ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. భరత్ రెడీ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బొద్దుగా ఉండే అతను ఇప్పుడు స్మార్ట్ గా తయారయ్యాడు. ఈ సినిమా అల్లు శిరీష్ కి చాల ముఖ్యమైనదే అని చెప్పొచ్చు. ఏందుకంటే ఎప్పటి వరకు అల్లు శిరీష్ ఏంత ప్రయత్నించిన సరైన హిట్ రాలేదు.


ఈ సినిమా ఈ నెల 17వ తేదిన విడుదల కాబోతుంది మరి మన చిట్టి దీవెన ఏల నటించిందో వేచిచూడాలి. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూడా ఒక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఫిలింనగర్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా రాబోతున్నాడని అందరకి విదితమే


మరింత సమాచారం తెలుసుకోండి: