గ్లామర్ కి గ్రామర్ నేర్పుతున్న హాట్ బేబీ రష్మిక. ఆమె చలో అంటే యూత్ పోలోమంటారు. హలో గీతా అంటారు. ఓ విధంగా రష్మిక తెలుగు తెరకు కొత్త అందంగా వచ్చి బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే మిగిలిన భామల్లా రష్మిక కాదు, ఈ ముద్దు గుమ్మ చాలా తెలివిగా తన కెరీర్ ని డిజైన్ చేసుకుంటోంది. నాలుగు కాలాల పాటు తెలుగు తెరను ఏలాలనుకుంటోంది. అందుకోసం తనదైన స్ట్రాటజీని ఫాలో అవుతోంది.


చిన్న సినిమా చలో ద్వారా ఎంటరైన రష్మిక ఇపుడు అవే చిన్న సినిమాలకు అందని పండుగా మారిందట. చిన్న సినిమా నిర్మాతలు ఆమెను అప్రోచ్ అవడానికి చూస్తే ముఖం చాటేస్తోందంట. ఆమె చూపు బిగ్ ప్రొడక్షన్ హౌస్, టాప్ స్టార్స్ మీదనే ఉందని అంటున్నారు. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలన్న ఉద్దేశ్యంతోనే రష్మిక చిన్న సినిమాలకు నో చెబుతోందని అంటున్నారు.


ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసిన రష్మిక అల్లు అర్జున్ తోనూ నటించేందుకు రెడీ అంటోంది. ఇలా ఏడాదికి ఒకటో రెండో టాప్ హీరోల మూవీస్ సినిమాల్లో నటిస్తే చాలు, మెల్లగా కెరీర్ సాగుతుంది. ఎక్కువ రోజుల పాటు స్టార్ గా కొనసాగవచ్చునన్నది రష్మిక ప్లాన్ గా కనిపిస్తోంది. మరి చూడాలి ఆమె ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: