బాలక్రిష్ణ సినిమాలకు సహజంగా పవర్ ఫుల్ టైటిల్స్ ఉంటాయి. అదే రేంజిలో హిట్లు కూడా ఉంటాయి. బాలయ్య సినిమాలు కూడా ఆయన రోషాన్ని, పౌరుషాన్ని  ఎలివేట్ చేస్తూ క్యారక్టర్ డిజైన్ చేస్తారు. బాలయ్య రౌద్ర రసాన్ని బాగా పండిస్తారు. ఆ టైప్ పాత్రలు వస్తే బాలయ్య తెరపై  రెచ్చిపోతారు. ఇక బాలయ్య సినిమాలకు డైరెక్టర్లు ఎవరైనా టైటిల్ విషయంలో ఇలాగే ఆలొచన చేస్తారు. ఇపుడు కూడా కొత్త సినిమాకు అలాంటి టైటిల్ వెతికి మరీ పెట్టారు.


బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న కోత్త  మూవీకి రూలర్ అని అనుకుంటున్నారుట. ఈ నెల 17న ఈ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ బాగుందని టాక్ వస్తున్నా రూలర్ అన్నది ఎక్కడో రీసౌండ్ చేస్తోంది.  అదే అబ్బాయి జూనియర్ నటించిన దమ్ము సినిమాలోని సాంగ్ అది. రూలర్ అంటూ ఆ పాటలో జూనియర్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. నిజానికి దమ్ము సినిమా సరిగా ఆడలేదు కానీ లేకపోతే రూలర్ తో మూవీ తీయాలని కూడా అనుకున్నారట.


ఇపుడు ఆ టైటిల్ బాలయ్య వద్దకు వచ్చింది. అబ్బాయి పాపులర్ సాంగ్ తన సినిమాకు టైటిల్ అంటే బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతారో మరి. ఓ వైపు బాబాయి, అబ్బాయి రిలేషన్స్ సరిగ్గా లేవన్న టాక్ నడుస్తోంది. మరి ఇది తెలిసి కూడా  డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ టైటిల్ పెట్టారా అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారట. ఏది ఏమైనా రూలర్ టైటిల్ తమ నందమూరి ఫ్యామిలీకే తిరిగి వచ్చిందని ఉమ్మడి అభిమానులు హ్యాపీగా ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: