సాధారణంగా మీసాలు తిప్పడం తోడ కొట్టడం లాంటి బాడీ లాంగ్వేజ్ నందమూరి హీరోలలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఎవరు ఊహించని విధంగా మహేష్ మీడియా ఎదుట కాలర్ ఎగుర వేయడం దృశ్యాన్ని చూసిన వారంతా షాక్ అవ్వడమే కాకుండా మహేష్ కు ఏమైంది అంటూ ఆశ్చర్యపోయారు. 

ఈ ఆశ్చర్యకర దృశ్యం నిన్న జరిగిన ‘మహర్షి’ సక్సస్ మీట్ లో కనిపించింది. ఈ మీట్ లో మహేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈమూవీ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానులు కాలర్ ఎత్తుకునే విధంగా ఉంటుందని జోస్యం చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు ఈమూవీ సక్సస్ ను చూసిన తరువాత తాను నిజంగానే కాలర్ ఎగరేసాను అంటూ తన కాలర్ ఎగరవేసాడు.

దీనితో ఈ సక్సస్ మీట్ ను కవర్ చేస్తున్న మీడియా కెమెరాల దృష్టి అంతా మహేష్ చేసిన కాలర్ ఎగరేవేయడం పై దృష్టి మళ్ళింది. ఈ సంఘటన చూసిన తరువాత మరికొందరైతే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాదు అని నెగిటివ్ ప్రచారం చేస్తున్న కొందరి మాటలకు స్పందనగా మహేష్ ఈ రిప్లయ్ ఇచ్చి ఉంటాడు అంటూ అభిప్రాయ పడుతున్నారు.

కారణాలు ఏమైనా మహేష్ ఇలా కాలర్ ఎగరవేయడం మహేష్ అభిమానులకు జోష్ ను ఇస్తూ ఉంటే ఇండస్ట్రీ వర్గాలలో చర్చలకు కేంద్రంగా మారింది. ఇదే సందర్భంలో మహేష్ అల్లరి నరేశ్ గురించి మాట్లాడుతూ తాను ఈమూవీలో రవి పాత్రను అల్లరి నరేశ్ చేస్తాడా నో చెపుతాడా అనుకుంటూ తాను పడ్డ టెన్షన్ ను వివరిస్తూ ఈమూవీ సక్సస్ లో అతడికి కూడ వాటా ఉంది అని చెప్పడం మహేష్ మంచి మనసును సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈరోజు ‘మహర్షి’ మొదటి సోమవారం .పరీక్షను ఎదుర్కుంటున్న నేపధ్యంలో ఈరోజు ఈమూవీకి వచ్చే కలక్షన్స్ ను బట్టి ‘మహర్షి’ ఏ రేంజ్ హిట్ అన్నది నిర్ణయింపబడుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: