సుకుమార్ అల్లు అర్జున్ ల మూవీ ఈనెల 11వ తారీఖున ప్రారంభం అవుతుంది అని అంతా భావించారు. అయితే ఈమూవీ ప్రారంభం అయినట్లుగా ఎక్కడా వార్తలు రాలేదు. దీనితో సుకుమార్ బన్నీల మూవీ మళ్ళీ వాయిదా పడటానికి గల కారణాల పై ఇండస్ట్రీలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.

వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ తో తాను చేస్తున్న మూవీ పూర్తి అయ్యేదాకా సుకుమార్ మూవీని మొదలు పెట్టకూడదు అని భావించినా సుకుమార్ నుంచి పెరిగి పోయిన ఒత్తిడితో ఈమూవీని ఈనెల 11న ప్రారంభించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిముషంలో బన్నీ తన మనసు మార్చుకుని తన భార్య పిల్లలతో సమ్మర్ వెకేషన్ కు విదేశాలు వెళ్ళి పోవడంతో మళ్ళీ సుకుమార్ మూవీ అటకెక్కింది అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో సుకుమార్ తో నిజంగా అల్లు అర్జున్ సినిమా చేస్తాడా లేకుంటే కేవలం మొహమాటానికి ఈమూవీని ఒప్పుకున్నాడా అన్న ప్రచారం మళ్ళీ మొదలైంది. తెలుస్తున్న సమాచారం మేరకు కథలు వ్రాయడంలో దిట్ట అయిన సుకుమార్ ‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత హీరోలను మెప్పించే విధంగా కథలు వ్రాయలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

దీనికి కారణం సుకుమార్ ఎన్ని కథలు హీరోలకు చెప్పినా ఆ కథలు అన్నింటిని ‘రంగస్థలం’ స్థాయిలో లేవు అంటూ మరింత మంచి కథ వ్రాయమని గతంలో మహేష్ ఇప్పుడు అల్లు అర్జున్ చెపుతున్న మాటలు సుకుమార్ ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. దీనితో ‘రంగస్థలం’ సుకుమార్ కు మేలుచేసిందా లేదంటే కీడు చేసిందా అంటూ సుకుమార్ పై అతడి అభిమానులు సన్నిహితులు కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: