నిన్న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తరఫున ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధుల సమావేశంలో చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలలో గెలవడం తధ్యం అని వార్తలు వస్తున్నా ‘జనసేన’ కు టోటల్ గా ఎన్ని స్థానాలు వస్తాయి అన్న విషయమై తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడ చెప్పలేకపోతున్నారు.

ఇలాంటి పరిస్థుతులలో నిన్నటి సమావేశంలో పవన్ మాట్లాడుతూ ‘ప్రజారాజ్యంలోకి వచ్చినవారు ఆశలతో వచ్చారు. జనసేన లోకి వచ్చిన వారు ఆశయాలతో వచ్చారు’ అని అన్న కామెంట్స్ దేనికి సంకేతాతం అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 

రాబోతున్న ఎన్నికల ఫలితాలలో పవన్ తో పాటు ‘జనసేన’ పార్టీ పై పోటీ చేసిన ఎంతోకొంతమంది నెగ్గుతారు అన్న నమ్మకం ఏర్పడటంతో పవన్ ఈ కామెంట్స్ చేసాడు అని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ లేకుంటే చంద్రబాబులలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కాబట్టి ఆతరువాత ఏర్పడే పరిస్థుతులలో ‘జనసేన’ తో ఎన్నికైన అభ్యర్ధులు పవన్ తో కలిసి అధికారం లేకుండా సుదీర్ఘ రాజకీయ పోరాటం చేయాలి అంటే చాల త్యాగాలు చేయాలి. 

అలా త్యాగాలు చేసే విధంగా తన క్యాడర్ ను అదేవిధంగా తన పార్టీ పై ఎంపిక కాబోయే భవిష్యత్ ఎమ్.ఎల్.ఏ లను ప్రలోభాలకు లోబడి అధికార పక్షంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళను చైతన్య పరచడానికి పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీలోని ఎమ్.ఎల్.ఏ లు అయినా అధికారం లేకుండా ఒక్కరోజు కూడ ఉండలేకపోతున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పవన్ చెపుతున్న ఉదాత్తమైన మాటలు విని గెలిచిన అభ్యర్ధులు ఎంత వరకు పవన్ వెంట సుదీర్ఘ రాజకీయ పోరాటం కొనసాగిస్తారు అన్నది రానున్న రోజులు తెలియచేస్తాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: