పొల్టికల్ లీడర్ దగ్గర్నుండి ఇండస్ట్రీలో ఏ హీరో అయినా.. పొగడాలన్నా.. తిట్టాలన్నా.. తనకు నచ్చని ఏ ప్రముఖుడిని చీల్చి చెండాడాలన్నా.. ఆ గుండె ధైర్యం ఉన్న ఒకే ఒక్కడు పోసాని మాత్రమే. పోసాని ఏం మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది. మనసులో ఉన్న మాటను సూటిగా అనేయడం ఆయన అలవాటు. నిజాయితీగా మాట్లాడితే అందులో ఇంత నిజం ఉంటుందా.. అని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఈ విషయూంలో పోసాని స్టైలే వేరు.


ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ ను కూడా వదల్లేదు. మే 9న మహర్షి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని విజయవంతంగా ప్రదర్షింపబడుతోంది. ఈ సినిమాలో రచయిత, దర్శకులు, నటులు పోసాని కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా సక్సస్ ఫుల్ గా రన్నవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహేష్ చాలా అందగాడని, తనకంటే అందగాడు ఇంకొకరు లేరని, రోజు రోజుకి మహేష్ అందం డబుల్ వుతుందని చమత్కరించారు. 


ఒకవేళ.. నేనే గనక ఆడపిల్లనైతే మహేష్ ని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకునే వాడిని కాదని..ఒప్పుకోకపోతే వెంట పడేవాడినని జోక్స్ వేస్తూ అక్కడున్న వాళ్ళందరిని నవ్వించాడు. నిజమే 40 ఏళ్ళలో కూడా ఇంత హ్యాండ్సం గా ఉన్నారంటే పోసాని కాదు ఎవరైనా వెంట పడాల్సిందే. అన్నట్టు మహర్షి ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: