మ‌హాన‌టి సినిమాతో ఒక్క‌సారిగా ఇండియ‌న్ స్క్రీన్‌పై పాపుల‌ర్ అయిన మ‌హాన‌టి పొలిటిక‌ల్ ఎంట్రీ వార్త‌లు కొద్ది రోజులుగా మీడియాలో వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ బీజేపీలో చేరుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల‌పై ఆమె త‌ల్లి సీనియ‌ర్ హీరోయిన్ మేన‌క స్పందించారు. తాము బీజేపీ పార్టీకి సానుభూతిప‌రుల‌మే అని ఆమె చెప్పారు. త‌న భ‌ర్త‌కు బీజేపీలో స‌భ్య‌త్వం ఉంద‌ని చెప్పిన మేన‌క త‌మ కుటుంబం అంతా బీజేపీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గానే ఉంటామ‌ని చెప్పింది.

ఇదే క్ర‌మంలో త‌న కుమార్తె మేన‌క పొలిటిక‌ల్ ఎంట్రీపై సైతం మేన‌క స్పందించింది. ప్రస్తుతం సినిమాల్లో చాలా ఛాన్సులు వ‌స్తున్నందున ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ ఇప్ప‌ట్లో ఉండే అవ‌కాశం లేద‌ని కూడా చెప్పింది. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని తాము ఇటీవ‌ల క‌లిసిన మాట నిజ‌మే అన్న మేన‌క... త‌మ‌లాంటి క‌ళాకారులు అంద‌రిని మోడీ పిలిపిస్తోన్న విష‌యాన్ని కూడా చెప్పింది.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు కూడా మోడీ ఎంతోమంది సినిమా ఆర్టిస్టుల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే.  మోడీని క‌లిసిన వారిలో సురేష్ గోపి, కవిత, తాము ఉన్న‌ట్టుగా మేనక వివరించింది. ఇక తాము బీజేపీకి పూర్తి వీర‌విధేయులం అని చెప్పిన మేన‌క ఆ పార్టీ త‌ర‌పున ఏం చేసేందుకు అయినా వెనుకాడ‌మ‌ని కూడా తెలిపింది. ఏదేమైనా యంగ్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడే ఇలా కీర్తీ సురేష్‌పై పొలిటిక‌ల్ ముద్ర ప‌డుతోంది. భ‌విష్య‌త్తులో ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: