టాలీవుడ్ లోకి ‘చిత్రం’సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ తర్వాత జయం లాంటి ప్రేమ కథతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  ఈ సినిమాతోనే నితిన్, సదా హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో ‘నిజం’సినిమా తీశాడు.  ఇలా కొన్ని ప్రేమ, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తో తేజ సినిమా తీసినా పెద్దగా ఫలితాలు పొందలేదు.  దాంతో కొంత కాలం సినిమాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మద్య రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరోసారి సెన్సేషన్ సృష్టించాడు.  


తాజాగా ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను 'నిజం' పేరిట ఓ సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి, చేతులు, కాళ్లూ కాల్చుకున్నానని, మరోసారి అదే పని చేసే ప్రయత్నాలు చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఈ మద్య చాలా మందికి కమర్షియల్ సినిమాపైనే మోజు ఎక్కువ అని..మెసేజ్ అంటే బోర్ ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారని..అందుకే అలాంటి సినిమల జోలికి వెళ్లకుండా ఉంటున్నానని అన్నారు.


ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తీస్తున్న 'సీత' గురించి ప్రస్తావిస్తూ, ఇది తేజ రామాయణమని, ఆ కాలంలో సీత చాలా సాఫ్ట్ మహిళని, తన సీత మాత్రం అగ్రెసివ్ గా ఉంటుందని చెప్పారు.  తాను ఈ కథను కాజల్ కు చెప్పిన తరువాత, తానే ఈ సినిమాను చేస్తానని పట్టుబట్టిందని, ఆ కారణంగానే ఆమెనే ప్రధాన పాత్రకు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇక్కడ హిట్ కొట్టిన వారికే లైఫ్ లేదంటా వెనక్కి వెళ్లాల్సిందే. ప్రతి శుక్రవారం తమ జాతకాలు మారిపోతుంటాయని అభిప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: