బ్రహ్మానందం అంటే వెండి తెర మీద హాస్యం ఒలికించే కమెడియన్ గానే చాలామంది అనుకుంటారు. దానికి ముందూ తరువాత కూడా చాలా ఉంది. బ్రహ్మానందం  తెలుగు భాషాభిమాని. ఆయన తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ఆయనలో మంచి మేధావి ఉన్నారు. అంతే కాదు. ఆధ్యాత్మికపరుడు ఉన్నాడు. వేదాంతి ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు వింటూంటే ఒక అనుభవశాలి జీవిత సారాన్ని చెప్పినట్లుగా ఉంటుంది.


విషయానికి వస్తే బ్రహ్మానందానికి ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాన్ని విశాఖలో ప్రదానం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ తాను అనారోగ్యంతో ఉన్నపుడు కోట్లాదిమంది  అభిమానులే కాపాడారని ఎమోషన్ అయ్యారు. తాను కేవలం వెండితెరపైన నవ్వించినందుకు గానూ కోట్లాదిమంది ప్రజలు తాను నిండు నూరేళ్ళు ఉండాలని మనసారా కోరుకున్నారని, వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని అన్నారు. తాను ఇలా బతికి ఉన్నానంటే ప్రేక్షకుల నిండు ఆశీశ్శులే కారణమని ఆయన అన్నారు.


జీవితంలో ప్రతి ఒక్కరూ పైకి రావడానికి ప్రయత్నం చేయాలని, ఆపైన భగవంతుడు అందరినీ దీవిస్తాడని బ్రహ్మానందం చెప్పారు. సంగీతాన్ని, కళాకారులను అంతా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. భగవంతుడు ఒక్కడే అని అన్నమయ్య చెప్పాడని, దేవుడు ఒక్కడే కాబట్టి భేదభావాలు వీడి అంతా అతన్ని ప్రార్ధించాలని, మానవత్వాన్ని బతికించాలని బ్రహ్మానందం స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: