సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ఆయ‌న బ‌యోపిక్ ని తెర‌కెక్కించాలంటే ఎంతో కొంత ఆయ‌న గురించి క్షుణ్ణంగా తెలిసిఉంటే బావుంటుద‌ని ద‌ర్శ‌కుడు తేజ అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్టీఆర్ తనకు అభిమాన నటుడని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించిన దర్శకుడు తేజ, ఆయన బయోపిక్ గా రూపొందిన మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలను తాను చూడలేదని చెప్పారు.

ఈ రెండు సినిమాలకు తొలుత తేజను దర్శకుడిగా తీసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలోనే తేజ, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా, అప్పుడు తాను అటువంటి నిర్ణయం తీసుకోవ‌డానికి గ‌ల‌ కారణాన్ని తేజ వివరించారు.
ఎన్టీఆర్ చరిత్ర లోతుల్లోకి వెళ్లిన తరువాత, తానైతే ఆయనకు న్యాయం చేయలేనని అనిపించిందని, అందువల్లే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నానని, బాలకృష్ణతో గొడవలేమీ రాలేదని అన్నారు.

ఇక ఆ సినిమాలు చూస్తే, తానైతే ఎలా తీసుంటానో అన్న ఆలోచనలు చుట్టుముడతాయని, ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పే తాను, ఎందుకొచ్చిన గోలని వాటిని తిలకించలేదని స్పష్టం చేశారు. 

మ‌రి ఒక‌ర‌కంగా చెప్పాలంటే తేజ అన్న మాట‌ల‌ను చూస్తే ఆ చిత్రాలు తెర‌కెక్కిన విధానం క‌రెక్టేనా లేక తేజ‌కి ఈ బ‌యోపిక్‌ల‌ను అంత అద్భుతంగా రూపొందించేంత స‌త్తా లేదా అని సినీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ బాల‌య్య‌తో ఎటువంటి గొడ‌వ‌లు లేవ‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: