భరత్ కమ్మా దర్శకత్వంలో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ‘డియర్ కామ్రేడ్’.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా నుండి ఇంకో సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం.


కాలేజ్ బ్యాగ్డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తుందని టాక్. అంతే కాదు ఈ సినిమాలో కూడా ఈ సాంగ్ హైలెట్ గా ఉండబోతుండట. ఇక ఈ సాంగ్ ను మే 15న ఉదయం 11.11 గంటలకు విడుదల చేస్తారని లేటెస్ట్ అప్‌డేట్.


ఇక ఈ సినిమా విజయ కి స్టా డం ని తెచ్చి పెట్టిన 'అర్జున్ రెడ్డి' సినిమాలో లాగా మెడికల్ స్టూడెంట్ గా నటించాడట. అంతేకాదు అర్జున్ రెడ్డి లా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని చిత్ర బృందం ధీమాగా ఉందట. ఇక ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. 'గీత గోవిందం'తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియోట్ చేసిన విజయ్ ఈ సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియోట్ చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: