సినిమా రంగంలో చాలా మందికి ఒక్కసారిగా స్టార్ డం, పాపులారిటీ వచ్చేస్తుంది. ఇక హీరో, హీరోయిన్స్, కొరియోగ్రాఫర్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సినిమా గనక సూపర్ హిట్ అయితే చాలు ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత కొన్నేళ్ళు అవకాశాల కోసం వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. 
డబ్బుకు డబ్బు ,పేరుకు పేరు వాటంతట అవే చుట్టూ తిరుగుతుంటాయి. ఇదంతా గట్టి పోటీ ఎదురుపడ్డంతవరకు, అలాగే ఒక్క ఫ్లాప్ పడనంత వరకు మాత్రమే...ఒక్కసారి గనక ఫ్లాప్ పడిందా ఇక మొహం చూసేవాళ్ళుండరు. 


చిన్న అవకాశం ఇవ్వడానికి కూడా మొహం చాటేస్తారు. అప్పటి నుంచి లెక్కనేనన్ని అవమాలు పడాలి, చీకటి గదిలో కూర్చొని ఏడవాలి. ఇక మనం ఎవరికి పనికి రాము అనుకుంటే ఉదయ్ కిరణ్ లా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి ఉండదు. సరిగ్గా ఇలాంటి విషయం గురించి ప్రముఖ క్లాసికల్ డాన్స్ కొరియోగ్రాఫర్ 'శివశంకర్' మాస్టర్ సంచలనమైన వ్యాఖ్యలను చేశారు.


తెలుగు, తమిళం, మళయాళం, హిందీ...ఇలా ఎన్నో భాషల్లో నృత్య దర్శకుడిగా శివశంకర్ మాస్టర్ అనేక చిత్రాలకు పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 46 సంవత్సరాలుగా ఉన్న ఆయన ఎంతకాలం ఇండస్ట్రీలో వున్నాను అనేది కాదు .. ఏం సాధించానన్నదే ముఖ్యం. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వెళ్లాలనే ఉద్దేశంతో ఉంటాను. బతికున్నంత వరకూ సినిమాలకి పనిచేస్తూ వుండాలి. సినిమాలకి పనిచేస్తున్నంతవరకూ బతికుండాలి .. 'అవకాశాలు రావడం లేదే' అనే బాధతో చనిపోకూడదు" అంటూ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమను పంచుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: