ఎలాంటి విషయాన్నైనా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పే దమ్ము, ధైర్యం ఉన్న వాళ్ళలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఎక్కడ నిజాయితీ ఉందో అటు వైపు మాట్లాడుతు గట్టి సపోర్ట్ ఇస్తుంటారు. అర్జున్ రెడ్డి సమయంలోను చిత్ర బృందానికి ఎంతో సహకరించారు. అందుకే చిన్న చిత్రాలను నిర్మించే దర్శక, నిర్మాతల దగ్గర్నుంచి యూత్ వరకు అందరు గురువుగా భావించి తమారెడ్డిగారి సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. అందుకే ఆయన కూడా ఎవరు పిలిచినా చిన్నా పెద్దా అనే తెడా లేకుండా ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ఆడియో ఫంక్షన్స్, సక్సస్ మీట్స్ కి వెళ్ళి అభినందిస్తుంటారు.


ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే ఉండే ముద్దు సీన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా కామన్ అయ్యాయి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 చిత్రాల తర్వాత చిన్న చిత్రాల్లో దాదాపు అన్నింటిలో కూడా ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ ను పెడుతున్నారు. రీసెంట్‌గా "డిగ్రీ కాలేజ్" అనే చిత్రంలో ముద్దు సీన్స్ పెట్టడం జరిగింది. ఆ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు "జీవిత" ఆ చిత్ర యూనిట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీని గురించి ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'డిగ్రీ కాలేజ్' తీసిన దర్శకుడు నరసింహ నంది మంచి దర్శకుడు. ఆయన తీసిన 1940 లో ఓ గ్రామం సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా కలెక్షన్స్ ను తెచ్చిపెట్టలేదు. అందుకనే "డిగ్రీ కాలేజ్" కథ డిమాండ్ మేరకు ముద్దు సీన్స్ పెట్టి ఉండొచ్చు. అయితే ఇలాంటి సినిమా వేడుకలకు జీవిత వంటి వారిని ఆహ్వానించడం సరైన పద్దతి కాదని ఈ సందర్బంగా తమ్మారెడ్డి అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: