తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించిన మీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.   తక్కువ చిత్రాల్లో నటించినా..పవన్ కళ్యాన్ ఎక్కువగా మాస్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు.  పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  ఈ ఐదేళ్లలో ప్రజల తరుపు నుంచి పోరాటం చేస్తూ..ప్రభుత్వాన్ని సమస్యలపై ప్రశ్నిస్తూ వచ్చారు. 

గత నెలలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.  అయితే తమ అభిమాన హీరో వెండి తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.   ఇటీవల చాలా మంది మిస్ యు పవర్ స్టార్ అని సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. కానీ చాలా వరకు పవన్ రాజకీయాల్లో సరికొత్త అడుగులు వేస్తుండడం ఫ్యాన్స్ కి  ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే పవన్ కళ్యాన్ మాత్రం తన చిత్రాల గురించి ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. 

మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. అయితే పవన్ చిరకాల రాజకీయాల్లో కొనసాగాడని మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్లిపోతాడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన జనసేన మీటింగ్ లో ఐదేళ్ల పాలన కోసం కాకుండా రానున్న 25 ఏళ్ల భవిష్యత్తు కోసం జనసేన పని చేయాలనీ అన్నారు.  ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయాల్లోనే కోనసాగాలని అన్నాడు.  అంతే కాదు కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకున్న పవన్ వారికి మళ్ళీ రెమ్యునరేషన్ ని తిరిగిచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: