షావుకారు జానకి. ఈ పేరు సినిమాల గురించి అవగాహన ఉన్న వారికి పరిచయం చేయనవసరం లేదు. ఆమెది దశాబ్దాల సినీ జీవితం. ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన షావుకారు జానకి అద్భుతమైన నటీమణి. ఆమె ఆలీతో సరదాగా కార్యక్రమంలో  పాలుపంచుకుని తన గురించి  ఎన్నో విషయాలను ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. 


మహానటి సావిత్రి గురించి మాట్లాడుతూ జానకి ఆమె సినిమా జీవితం గొప్పది, మంచి నటి. ఆమెను అంతవరకే చూడాలి. ఆమె వ్యక్తిగగ జీవితం తెలియడం అనవసరం అని చెప్పారు. మహానటిలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి చూపించడం బాధ కలిగించిందని ఆమె అన్నారు. ఆమె నటిగా హిమశిఖరమని అదే అంతా చూడాలి తప్ప వ్యక్తిగతం ఎందుకు, దాని వల్ల వచ్చిన లాభమేంటి అని ఆమె ప్రశ్నించారు.

దేవదాస్ మూవీలో మొదట తనను తీసుకుని తరువాత పక్కన పెట్టిన తీరుని వివరిస్తూ ఆనాడు తాను పది రోజుల పాటు భోజనం మానేశానని చెప్పుకొచ్చారు. మళ్ళీ జన్మ ఉంటే దేవదాస్ గా నాగేశ్వరావు తిరిగి పుడతారని, తాను పార్వతిగా ఆయన పక్కన నటిస్తానని చెప్పారు. ఇక ఎంటీయార్ లాంటి నటుడు పుట్టోబోడని ఆయనకు ఆయనే సాటి అన్నారు. శ్రీదేవిని యాంజిల్ గా  పోల్చిన ఆమె ఆమె పుట్టుకతోనే స్టార్ అని కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: