సినీరంగం అంటేనే సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారు. ఓ సినిమా సక్సస్ అవ్వాలన్నా.. ఫ్లాప్ కావాలన్నా చాలా ఫ్యాక్టర్స్ పని చేస్తాయి. 24 క్రాఫ్ట్స్ సరిగ్గా పని చేస్తేనే సినిమా హిట్. ఒక్కోసారి ఎంత కష్టపడిన సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరించరు. 


అందుకే సినీరంగంలో సెంటిమెంట్లు ఎక్కువ. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ఓ సెంటిమెంటే స్ప్రెడ్ అవుతోంది. అందేంటంటే.. ఏదైనా సినిమా ఫంక్షన్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా వస్తే ఆ సినిమా  ఫట్టేనట. ఇందుకు కొన్ని ఉదాహరణలను వారు ప్రచారంలోకి తెస్తున్నారు. 

నాగచైతన్య 'సవ్యసాచి' ప్రీ రిలీజ్‌కి విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ కెరీర్‌లోనే ఫస్ట్ ఫ్లాప్‌గా ఆ సినిమా నిలిచింది.  'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా నటించిన 'నువ్వు తోపురా' ట్రైలర్ లాంచ్‌కి కూడా విజయ్ దేవరకొండ గెస్ట్‌. ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. 

నిహారికా కొణిదెల 'సూర్యకాంతం' ప్రీ రిలీజ్‌కీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. అదీ ఫట్టే.. తాజాగా మహేష్ బాబు 'మహర్షి'  ప్రీ రిలీజ్‌కి వెంకటేష్ ముఖ్య అతిథిగా వస్తే... విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. అందుకే ఈ సినిమా కూడా అంతగా ఆడటంలేదంటున్నారు కొందరు. కానీ.. సినిమాతో సంబంధం లేకుండా పాపం.. గెస్ట్ గా వచ్చినందుకు కూడా ఇలా సెంటిమెంట్లు స్ప్రెడ్ చేస్తే ఎలా..పాపం కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: