టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ బ‌ర‌ద్వాజ్‌. ఎప్ప‌టినుంచి ఉన్న వ్య‌క్తిగా అన్ని విష‌యాల‌పై ఆయ‌న‌కు అవ‌గాహ‌న ఎక్కువ అంద‌రి వ్య‌క్తులతో ప‌రిచయాలు ఎక్కువే. అందుకే ఇండ‌స్ట్రీలో జ‌రిగే ప్ర‌తి విష‌యం పై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంట‌ర్యూలో ఆయ‌న మాట్లాడుతూ... నాకు ఎవ‌రి పైనా కోపం ఉండ‌దు. నాకేదో కోసం ఉంద‌ని కొంత‌మంది అంటుంటారు.  నిజానికి స్టార్ హీరోలంతా నాతో ఎంతో సన్నిహితంగా వుంటారు. వాళ్లపై నాకు ఎలాంటి కోపం లేదు .. నా బాధంతా వాళ్లు దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచడం లేదనే.
ఎంతసేపూ కథ మాకు చెప్పండి, మేము ఏదో చేస్తాం అంటారు .. నిజానికి 'బాహుబలి' కథ చెబితే ఎవరూ చేయవలసిన సినిమా కాదు అది. కానీ అక్కడ దర్శకుడిని నిర్మాత .. హీరో హీరోయిన్లు పూర్తిగా నమ్మారు. అందువల్లనే అంతగొప్ప సినిమా వచ్చింది. అలా దర్శకుడిపై నమ్మకం ఉంచిన రోజున అన్ని సినిమాలు బాగానే ఆడతాయి. అలా నమ్మకం పోవడం వలన హీరోలపై కోపం వుంటుందే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు" అని చెప్పుకొచ్చారు.
ఎంతో క‌ష్ట‌ప‌డి ఓ క‌థ‌ను త‌యారు చేసుకున్న ద‌ర్శ‌కుడు క‌థ విన్నాక కొంత మంది హీరోలు మార్పులు చెపుతుంటారు. అవి కొన్ని క‌థానుగుణం కొన్ని చేయ‌గ‌లుగుతారు కొన్ని చేయ‌లేక‌పోవ‌చ్చు అంత మాత్రానా వాళ్ళు చెప్పే మార్పు చేస్తే హిట్ అవుతుంద‌ని కాదు. చేయ‌క‌పోతే ఫ్లాప్ అవుతుంద‌ని కాదు. అది క‌థ‌కు ఉండే బ‌లాన్ని బ‌ట్టి ఉంటుంది. అందుకే పూర్తిగా ద‌ర్శ‌కుడి ప‌ని ద‌ర్శ‌కుడిని చేయ‌నిస్తే బావుంటుంద‌ని ఆయ‌న భావ‌న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: