పూరీ జగన్నాథ్.. ఒక హీరోయిన్ ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడంటే ఆ హీరోయిన్ డెఫినెట్ గా స్టార్ హీరోయిన్ అవడం ఖాయం. అందుకు ఉదాహరణ రక్షిత, ఆసిన్, రేణు దేశాయ్, అదాశర్మ...ఇలా లిస్టు పెద్దగానే ఉంటుంది. అయితే ఇప్పుడు పూరీ హీరోయిన్ ‘హార్ట్ ఎటాక్’ఫేమ్ ఆదా శర్మ ‘కల్కి’ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆదా కథానాయికగా నటిస్తోంది. 


ఈ సందర్భంగా కల్కి సినిమాతో పాటు తను నటిస్తున్న మిగతా ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలిపింది. అబీర్‌సెన్‌ గుప్తా దర్శకత్వంలో రెడీ అవుతున్న ‘మ్యాన్ టు మ్యాన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆదా.. భిన్నమైన పాత్ర పోషిస్తున్నానని..  'మగాడిగా' కనిపించనున్నానని ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పింది. అబ్బాయిలా నటించబోతుండటంతో... చాలా ఆతృతగా ఉందట.
 
ఇక పూరీ డైరెక్ట్ చేసిన హార్ట్ ఎటాక్ తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరైన అదా రక రకాల వీడియోస్‌తో ఎప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో మగాడిగా నటించి ప్రేక్షకులకు షాకిద్దామని ఫిక్సైంది. ఏదేమైనా పూరీ హీరోయిన్ కి తన లాగా డేర్ ఎక్కువే.   


మరింత సమాచారం తెలుసుకోండి: