పుర్రెకో బుద్ధి... జిహ్వ‌కో రుచి అన్నారు పెద్ద‌లు. కాలం మారుతుండ‌డంతో వింత పోక‌డ‌లు, కోరిక‌లు కూడా పెరుగుతున్నాయ్‌. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్‌క‌పూర్ త‌న వింత కోరిక‌ను బ‌య‌ట పెట్టుకున్నాడు. షాహిద్ ప్ర‌స్తుతం కబీర్ సింగ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన అర్జున్‌రెడ్డి సినిమాకు రీమేక్‌గా క‌బీర్‌సింగ్ వ‌స్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాపై బాలీవుడ్ యూత్ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో షాహిద్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ప‌లు చిలిపి ప్ర‌శ్న‌ల‌కు కొంటె ఆన్స‌ర్లు ఇవ్వ‌డంతో ఇప్పుడు అవి కాంట్ర‌వ‌ర్సీగా కూడా మారాయి. త‌న‌కు హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్స‌ర్ అంటే పిచ్చి పిచ్చి ప్రేమ అన్న షాహిద్ మ‌రోసారి త‌న‌పై అనంతాభిమానం చాటుకున్నాడు. ఆమె గురించి గ‌తంలో కూడా షాహిద్ మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

ఇక మిస్ట‌ర్ ఇండియా మాదిరిగా మీకు మాయం అయ్యే సూప‌ర్ ప‌వ‌ర్ వ‌స్తే ఎవ‌రు స్నానం చేస్తుంటే చూడాల‌నుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇస్తూ ఆ ప‌వ‌ర్ వ‌స్తే అలాంట‌ప్పుడు ఇలాంటి చిన్న‌ప‌నులు కాకుండా ఇంకా పెద్ద ప‌నులు చేస్తాన‌న్నాడు. ఇక ఆ ఛాన్స్ వ‌స్తే తప్పకుండా స్కార్లెట్ జాన్సన్ స్నానం చేస్తున్నప్పుడు చూడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక త‌న వ‌ల్ల ఆమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న విష‌యాన్ని తాను జోక్‌గా చూస్తాన‌ని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: