ఈ మధ్య చిన్న సినిమాలు,పెద్ద సినిమాలు అనే తెడా లేకుండా దాదాపు అన్నీ సినిమాలలో గ్లామర్ డోస్ బాగా ఎక్కువైపోయింది. కొన్ని చిన్న సినిమాలలో అయితే..
ఏ సినిమా చూస్తున్నామో అన్న సందేహం రాక మానదు. ఎందుకంటే 'బోల్డ్ కంటెంట్' అని చెప్తూనే సినిమా నిండా డబుల్ మీనింగ్ డైలాగులు, లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ తో పరమ రొటీన్ అండ్ చెత్త సినిమాలను తీస్తున్నారు. వీటి వల్ల కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ప్రేక్షకులు వెల్లడం లేదు. 


సినిమా అంటేనే గ్లామర్ అసలు మా వల్లే కదా ప్రేక్షకులు థియోటర్లకు పరుగులు తీస్తుంది..మేము ఇంతా కష్టపడి ప్రేక్షకులను థియోటర్లకు రప్పిస్తుంటే ఆ క్రెడిట్ అంతా హీరోలు కొట్టుకుపోతున్నారు అని ఒకటి, రెండు హిట్లు పడ్డ హీరోయిన్స్ వాపోతుంటారు. అయితే దీని గురించి హీరోయిన్ తనదైన శైలిలో కామెంట్స్ చేసింది.  కోలీవుడ్‌లో అంబులి, మ‌యై, విలాసం వంటి చిత్రాల్లో న‌టించిన స‌న‌మ్ ప్ర‌స్తుతం `టికెట్` సినిమా చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. 


వెబ్ సిరీస్‌ల గురించి, అందులో హీరోయిన్ల అందాల ప్ర‌ద‌ర్శ‌న గురించి మాట్లాతు..`తెర‌పై గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డం, హీరోయిన్ల అందాల ఆరబోత త‌ప్పేం కాదు. ప్ర‌స్తుతం సినిమాల‌కు, వెబ్ సిరీస్‌ల‌కు మ‌ధ్య గీత చెరిగిపోయింది. వెబ్ సిరీస్‌లు మ‌రింత సహజంగా ఉంటున్నాయి. సినిమాల‌కు సెన్సార్ ఉంటుంది. వెబ్ సిరీస్‌ల‌కు అలాంటిది ఉండ‌దు. కాబ‌ట్టి క‌థ‌కు స‌రిపోయినంత గ్లామ‌ర‌స్‌గా న‌టించొచ్చు. అలాగే యువ‌త‌ను ఆక‌ట్టుకునే డైలాగ్‌లు కూడా చెప్పొచ్చ‌`ని స‌న‌మ్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: